కొవిడ్ ప్ర‌పంచం: ఒకేరోజు 2ల‌క్ష‌ల 30వేల కేసులు!

ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం సృష్టిస్తూనే ఉంది. ఈ మ‌హ‌మ్మారి బ‌య‌ట‌ప‌డి ఏడు నెల‌లు గ‌డుస్తున్నా ఉద్ధృతి మాత్రం త‌గ్గ‌డంలేదు. అంతేకాదు, నిత్యం రికార్డుస్థాయి కేసుల‌తో ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తోంది. తాజాగా నిన్న ఒక్క‌రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొత్త‌గా 2,30,370 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నివేదించింది.

Published : 13 Jul 2020 13:30 IST

అమెరికాలో 66,500, భార‌త్‌లో 28,500 కేసులు..

జెనీవా: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం సృష్టిస్తూనే ఉంది. ఈ మ‌హ‌మ్మారి బ‌య‌ట‌ప‌డి ఏడు నెల‌లు గ‌డుస్తున్నా ఉద్ధృతి మాత్రం త‌గ్గ‌డంలేదు. అంతేకాదు, నిత్యం రికార్డుస్థాయి కేసుల‌తో ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తోంది. తాజాగా నిన్న ఒక్క‌రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొత్త‌గా 2,30,370 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. అంత‌కుముందు జులై 10న 2,28,102 కేసుల రికార్డును దాట‌వేసింది. మ‌ర‌ణాలు మాత్రం స్థిరంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది. నిత్యం దాదాపు 5వేల కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్న‌ట్లు తెలిపింది.

అమెరికాలో 66,500 కేసులు..

రోజువారీగా అత్య‌ధిక కేసులు అమెరికా, బ్రెజిల్‌, భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా దేశాల్లో న‌మోద‌వుతున్నాయి. అమెరికాలో అత్య‌ధికంగా ఒక్క‌రోజే 66,500 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. బ్రెజిల్‌లో 35వేల కేసులు బ‌య‌ట‌ప‌డ‌గా, భార‌త్‌లో నిన్న ఒక్క‌రోజే 28వేల‌కు పైగా కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. ఇక ద‌క్షిణాఫ్రికాలోనూ గ‌డిచిన 24గంట‌ల్లో 13,500 కేసులు న‌మోద‌య్యాయి. ఇదిలాఉంటే, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే కోటి 30ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోక‌గా ఇప్ప‌టికే 5ల‌క్ష‌ల‌ 68వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చ‌ద‌వండి..
భార‌త్‌లో 23వేలు దాటిన కొవిడ్ మ‌ర‌ణాలు
2021 నాటికి వ్యాక్సిన్ వచ్చేనా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని