WHO: మళ్లీ కొవిడ్ విజృంభణ..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు, మరణాలు మరోసారి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కేసులు, మరణాల పెంపు
111 దేశాల్లో ‘డెల్టా’ : డబ్ల్యూహెచ్‌వో
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు, మరణాలు మరోసారి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పలుచోట్ల మళ్లీ నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. 9 వారాలుగా తగ్గుతూ వస్తున్న మరణాల సంఖ్య ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. క్రితం వారంతో పోలిస్తే 3 శాతం మరణాలు, 10 శాతం కేసులు పెరిగినట్లు బుధవారం వెల్లడించింది. ఈ వారంలో 55 వేల మంది మృతి చెందగా, 30 లక్షల కేసులు నమోదైనట్లు తెలిపింది. బ్రెజిల్, భారత్, ఇండొనేసియా, బ్రిటన్‌లలో అత్యధిక కేసులు బయటపడినట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగడం.. మాస్కులు, ఇతర నిబంధనలను సడలించడంతో పాటు కరోనా వైరస్ డెల్టా రకం వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కేసులు పెరిగినట్లు తెలిపింది. ఈ రకాన్ని 111 దేశాల్లో గుర్తించామని, రానున్న నెలల్లో ఇది మరింత విజృంభించే అవకాశం ఉందని పేర్కొంది.
- అర్జెంటినాలో కొవిడ్ మరణాల సంఖ్య లక్ష దాటింది. రష్యాలో ఈ వారంలో అత్యధిక రోజువారీ కేసులు నమోదయ్యాయి.
- బెల్జియంలో యువత ఎక్కువగా డెల్టా రకం బారిన పడుతోంది. ఇక్కడ గత వారం కంటే కేసుల సంఖ్య రెట్టింపు అయింది. బ్రిటన్‌లో గత 6 నెలల్లో ఎన్నడూ లేనంతగా ఒక రోజులో 40 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి.
- ఇండొనేసియాలో బుధవారం దాదాపు వెయ్యి మంది చనిపోయారు. 54 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మృతదేహాల ఖననం కూడా జకార్తాలో కష్టమైపోతోంది. అంత్యక్రియలు జరిపేందుకు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మయన్మార్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకూ కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తూనే ఉన్నారు.
- అమెరికాలో కొద్ది నెలలుగా తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత మూడు వారాలతో పోలిస్తే రోజువారీ కేసులు రెట్టింపు అయ్యాయి. లాస్ ఏంజెలిస్‌లో వరుసగా ఐదో రోజు వెయ్యికి పైగా కొత్త కేసులు బయటపడ్డాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Anushka Sharma: కాపీరైట్ ఆమెదే.. అనుష్క శర్మ పన్ను కట్టాల్సిందే..!
-
World News
No Smoking: ఆఫీసులో 4500 సార్లు స్మోకింగ్ బ్రేక్.. అధికారికి రూ.8.8లక్షల జరిమానా
-
Sports News
IPL 2023: ఎంఎస్ ధోనీకిదే చివరి సీజనా..? రోహిత్ సూపర్ ఆన్సర్
-
Politics News
Chandrababu: చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది: చంద్రబాబు
-
Movies News
Mahesh Babu: సోషల్ మీడియాలో మహేశ్ రికార్డు.. ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరోగా!
-
Politics News
TDP: ఎన్టీఆర్‌కు మరణం లేదు.. నిత్యం వెలిగే మహోన్నత దీపం: బాలకృష్ణ