Omicron: ఆఫ్రికా నుంచి భారత్‌కు వచ్చి అదృశ్యం!

ఒమిక్రాన్‌ ప్రభావం ఇప్పుడు భారత్‌పైనా పడింది. ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల భారత్‌కు వచ్చినవారిలో చాలామంది ఆచూకీ లభ్యం..

Updated : 01 Dec 2021 10:21 IST

చిరునామాల్లో దొరకని వందల మంది..

ముంబయి: ఒమిక్రాన్‌ ప్రభావం ఇప్పుడు భారత్‌పైనా పడింది. ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల భారత్‌కు వచ్చినవారిలో చాలామంది ఆచూకీ లభ్యం కావడంలేదు. పాస్‌పోర్టుల్లో పేర్కొన్న చిరునామాల్లో వారు ఉండకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వీరి ద్వారా కొత్త వేరియంట్‌ స్థానికంగా వ్యాపించే ముప్పుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఆఫ్రికా దేశాల నుంచి గత 15 రోజుల్లో సుమారు వెయ్యి మంది ముంబయికి చేరుకున్నారు. వీరిలో 466 మందిని గుర్తించామని ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల బిహార్‌కు వచ్చిన 281 మందిలో సుమారు 100 మంది కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించేందుకు నాలుగు విమానాశ్రయాల్లో ఆరోగ్య సిబ్బందిని మోహరించినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. వీరికి క్వారంటైన్‌ను తప్పనిసరి చేశారు. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చి పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తికి ఏ వేరియంట్‌ సోకిందన్న సందిగ్ధత ఇంకా వీడలేదు. జీనోమ్‌ విశ్లేషణ ఫలితాల కోసం అధికారులు నిరీక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని