Mixed Doses: మిశ్రమ డోసులతో గట్టి స్పందన

భిన్నరకాల కొవిడ్‌-19 టీకా డోసులతో గట్టి ఫలితమే ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది...

Published : 08 Dec 2021 12:25 IST

లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడి

లండన్‌: భిన్నరకాల కొవిడ్‌-19 టీకా డోసులతో గట్టి ఫలితమే ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీనివల్ల బలమైన రోగ నిరోధక స్పందన కలుగుతోందని తేలింది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఈ అధ్యయనాన్ని నిర్వహించగా ఆ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి. 1,070 మందిపై ఈ పరిశోధనను నిర్వహించారు.

ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు.. ఆస్ట్రాజెనెకా లేదా ఫైజర్‌ టీకాలను మొదటి డోసు కింద పొందినవారికి రెండో డోసు కింద మోడెర్నా లేదా నోవావాక్స్‌ వ్యాక్సిన్లను ఇచ్చారు. వీరిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకే కంపెనీ డోసులతో పోలిస్తే మిశ్రమ డోసుల వల్ల ఎక్కువగానే యాంటీబాడీలు విడుదలైనట్లు చెప్పారు. రెండో డోసు కింద మోడెర్నా వ్యాక్సిన్‌ను పొందినవారిలో స్వల్పకాల దుష్ప్రభావాలు కనిపించినట్లు వివరించారు. మరింత విస్తృతంగా టీకాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ వ్యూహం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని