12 గంటల్లో 31 గుడ్లు పెట్టిన కోడి

సాధారణంగా ఒక కోడి రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు పెడుతుంది? ఉత్తరాఖండ్‌లో ఓ కోడి ఏకంగా 31 గుడ్లు పెట్టింది.

Updated : 29 Dec 2022 08:28 IST

సాధారణంగా ఒక కోడి రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు పెడుతుంది? ఉత్తరాఖండ్‌లో ఓ కోడి ఏకంగా 31 గుడ్లు పెట్టింది. అదీ కేవలం 12 గంటల్లోనే. అల్మోరా జిల్లా బాసోత్‌ గ్రామానికి చెందిన గిరీశ్‌ చంద్ర బుధాని వద్ద ఒక కోడి ఉంది. అది ఇటీవల రోజుకు రెండు గుడ్లు చొప్పున పెట్టింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 31 గుడ్లు పెట్టిందని గిరీశ్‌ తెలిపారు. కోడిని పరిశీలించేందుకు గిరీశ్‌ ఇంటికి వచ్చిన పశుసంవర్ధక శాఖ అధికారులు వివరాలు తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి కోడిని చూడడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో గిరీశ్‌ ఇంటికి వస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని