91 ఏళ్ల లోనూ రైల్వే కూలీగా..

ఆ పెద్ద మనిషికి 91 ఏళ్లు. వృత్తిరీత్యా రైల్వే కూలీ ఆయన ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్నారు. ఈ వయసులోనూ తన కాళ్లపై తాను నిలబడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Published : 28 Jan 2023 04:30 IST

ఆ పెద్ద మనిషికి 91 ఏళ్లు. వృత్తిరీత్యా రైల్వే కూలీ ఆయన ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్నారు. ఈ వయసులోనూ తన కాళ్లపై తాను నిలబడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. 15 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌ నుంచి భారత్‌ వచ్చిన అతడే హరియాణాకు చెందిన కిషన్‌చంద్‌. దేశ విభజన అనంతరం పాక్‌ నుంచి భారత్‌లోని పానీపత్‌కు వచ్చారు. ఇక్కడ నిలువ నీడ లేక రైల్వే స్టేషన్‌నే నివాసంగా మార్చుకున్నారు. స్టేషన్‌లోనే కూలీ పనులు చేస్తూ జీవనం సాగించారు.  కిషన్‌చంద్‌ 35 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. అతడికి ఓ కుమార్తె, నలుగురు కుమారులు ఉన్నారు.  వారిపై ఆధారపడకుండా తన ఖర్చులు తానే వెళ్లదీసుకుంటున్నానని కిషన్‌ తెలిపారు. ‘‘మొదట్లో ఇక్కడ పనిలో చేరినప్పుడు దిల్లీ నుంచి వచ్చే రైలు ఇంజిన్‌లో బొగ్గు నింపేవాడిని. అప్పుడు నాకు ఒకటి, రెండు అణాలు ఇచ్చేవారు. బొగ్గును అంబాల వరకు తరలిస్తే రూ.1 ఇచ్చేవారు. ఇప్పుడు రోజుకు రూ.400 వస్తాయి. ఉదయం 8 నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ పనిచేస్తాను’’ అని కిషన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని