Mini couple: ‘మినీ కపుల్’.. కల్యాణ వైభోగమే!
రాజస్థాన్‌లో ఓ జంట పెళ్లి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వధూవరులిద్దరూ మరుగుజ్జులు కావడం.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేమించుకొని, పెద్దల ఆశీర్వాదంతో ఘనంగా పెళ్లి చేసుకోవడం ఇక్కడ విశేషం.
రాజస్థాన్‌లో ఓ జంట పెళ్లి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వధూవరులిద్దరూ మరుగుజ్జులు కావడం.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేమించుకొని, పెద్దల ఆశీర్వాదంతో ఘనంగా పెళ్లి చేసుకోవడం ఇక్కడ విశేషం. జోధ్‌పుర్‌కు చెందిన సాక్షి అనే యువతికి రాజ్‌సమంద్‌కు చెందిన రిషబ్‌తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారడంతో కుటుంబసభ్యులు కూడా అంగీకరించి ఏడాది క్రితమే నిశ్చితార్థం జరిపించారు. రెండు రోజుల కిందట.. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. సాక్షి, రిషబ్ జంట ఇన్‌స్టాగ్రాంలో ‘మినీ కపుల్’ అనే ఐడీని క్రియేట్ చేసి పెళ్లి ఫొటోలు, వీడియో పోస్ట్ చేశారు. వీటిని చూసినవారంతా కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ జంట చురుగ్గా ఉంటూ తమ జీవితాల్లో జరిగే విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకొంటున్నారు. రిషబ్‌కు ఇన్‌స్టాగ్రాంలో 2,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. రిషబ్ పోటీపరీక్షలకు సిద్ధమవుతుండగా.. ఎంబీఏ చదివిన సాక్షి ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP Govt: ఎవరి గ్లాసు వారే తెచ్చుకోండి.. రాగి జావ పోస్తాం
-
Politics News
Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. 2024 పూర్తి సినిమా: నారా లోకేశ్
-
Crime News
Andhra News: టిప్పర్ డ్రైవరా మజాకా.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సాహసం..
-
Politics News
Botsa: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక చిన్నది: మంత్రి బొత్స
-
Politics News
OTT : ఓటీటీ ప్లాట్‌ఫాంను సెన్సార్ పరిధిలోకి తేవాలి: కూనంనేని
-
Politics News
Payyavula: ‘వై నాట్ 175’ అనే గొంతులు మూగబోయాయి: పయ్యావుల