సవ్యసాచి.. స్వరూప

ఎవరైనా కుడి లేదా ఎడమ చేత్తో రాస్తారు. రెండు చేతులతోనూ ఏకకాలంలో రాసే సాధనతో ఓ మెరుపు మెరుస్తోంది కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక ఆదిస్వరూప.

Published : 07 Feb 2023 06:11 IST

బెంగళూరు(క్రీడలు), న్యూస్‌టుడే: ఎవరైనా కుడి లేదా ఎడమ చేత్తో రాస్తారు. రెండు చేతులతోనూ ఏకకాలంలో రాసే సాధనతో ఓ మెరుపు మెరుస్తోంది కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక ఆదిస్వరూప. ఏకకాలంలో రెండూ చేతులతో నల్లబల్లపై రాస్తూ తన నైపుణ్యం చాటుకుంటోంది. ఒకే నిమిషంలో కన్నడ, ఆంగ్ల భాషలను రెండూ చేతుల సాయంతో 45 పదాలను రాసి లతా ఫౌండేషన్‌కు చెందిన ప్రపంచ రికార్డుతో పాటు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు’లో స్థానాన్ని పొందింది. ఆమె మెదడు రెండు చేతులతో ఒకే సమయంలో పనులు చేయడానికి సహకరిస్తున్నట్లు నిపుణులు వివరించారు. ఇలాంటి అద్భుతమైన సాధనను చేసేవారు పది లక్షల మందిలో ఒకరు ఉంటారని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు