Rajasthan: మా మామలు బంగారం.. మేనకోడలి పెళ్లికి రూ.3 కోట్ల కట్నం

మేనకోడలి పెళ్లికి రూ.3.21 కోట్ల విలువ చేసే నగదు, ఆస్తులను కట్నంగా ఇచ్చారు ముగ్గురు సోదరులు. అందులో 10 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.30 లక్షలు విలువ చేసే స్థలం, 41 తులాల బంగారం, మూడు కిలోల వెండి, ట్రాక్టర్‌, స్కూటీ ఉన్నాయి.

Updated : 18 Mar 2023 06:46 IST

మేనకోడలి పెళ్లికి రూ.3.21 కోట్ల విలువ చేసే నగదు, ఆస్తులను కట్నంగా ఇచ్చారు ముగ్గురు సోదరులు. అందులో 10 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.30 లక్షలు విలువ చేసే స్థలం, 41 తులాల బంగారం, మూడు కిలోల వెండి, ట్రాక్టర్‌, స్కూటీ ఉన్నాయి. రూ.80 లక్షల నగదు కూడా ఇచ్చారు. దీంతోపాటు ఊళ్లోని ప్రతి ఇంటికి ఓ వెండి నాణేన్ని కానుకగా ఇచ్చారు. రాజస్థాన్‌ నాగౌర్‌ జిల్లాలోని బుర్డీ గ్రామానికి చెందిన హరేంద్ర, రామేశ్వర్‌, రాజేంద్ర అనే ముగ్గురు అన్నదమ్ములు ఇలా మేనకోడలిపై తమ ప్రేమను చాటుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు