అయిదేళ్ల బాలుడికి కానిస్టేబుల్‌ ఉద్యోగం!

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సర్గుజా జిల్లాకు చెందిన నమాన్‌ రాజ్‌వాడే అనే అయిదేళ్ల యూకేజీ విద్యార్థి పోలీస్‌ కానిస్టేబులుగా ఇటీవల నియామక పత్రం స్వీకరించాడు.

Published : 25 Mar 2023 04:54 IST

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సర్గుజా జిల్లాకు చెందిన నమాన్‌ రాజ్‌వాడే అనే అయిదేళ్ల యూకేజీ విద్యార్థి పోలీస్‌ కానిస్టేబులుగా ఇటీవల నియామక పత్రం స్వీకరించాడు. ఈ బాలుడి తండ్రి రాజ్‌కుమార్‌ రాజ్‌వాడే స్థానిక మహిళా పోలీస్‌స్టేషనులో కానిస్టేబుల్‌గా పని చేసేవారు. విధుల నిర్వహణ క్రమంలో కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. పోలీస్‌శాఖ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కింద నమాన్‌ రాజ్‌ వాడే నియామకానికి నిర్ణయం తీసుకున్నట్లు సర్గుజా జిల్లా ఎస్పీ భావనా గుప్తా తెలిపారు. ఇటువంటి సందర్భాల్లో మరణించిన వ్యక్తి కుటుంబంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసుగల వారుంటే ఉద్యోగావకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. నిబంధనల ప్రకారం.. ఆ బాలుడికి మైనారిటీ తీరిన తర్వాతే అంటే 18 ఏళ్లు నిండాకే పూర్తిస్థాయి విధుల్లోకి తీసుకుంటామన్నారు. భర్త మరణంతో బాధగా ఉన్నా, తన బిడ్డ పోలీసుగా మారబోతున్నందుకు సంతోషంగా ఉందని నమాన్‌ తల్లి నీతూ రాజ్‌వాడే తెలిపారు. ఇదే రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలోనూ తండ్రి అకాలమరణంతో అయిదేళ్ల మరో చిన్నారిని ఛైల్డ్‌ కానిస్టేబుల్‌గా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని