శవపేటికలో మద్యం అక్రమ రవాణా

బిహార్‌లో మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారు కొత్త ఎత్తుగడకు తెరతీశారు. పోలీసుల కన్నుగప్పడానికి శవపేటికలో మద్యం సీసాలు ఉంచి, వాటిని తరలించేందుకు అంబులెన్స్‌ను ఉపయోగించారు.

Published : 28 Mar 2023 05:23 IST

బిహార్‌లో మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారు కొత్త ఎత్తుగడకు తెరతీశారు. పోలీసుల కన్నుగప్పడానికి శవపేటికలో మద్యం సీసాలు ఉంచి, వాటిని తరలించేందుకు అంబులెన్స్‌ను ఉపయోగించారు. గయలో ఎక్సైజ్‌ పోలీసుల తనిఖీల్లో ఈ బండారం బయటపడింది. శవపేటికలో ఉంచిన 212 విదేశీ మద్యం సీసాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు మద్యాన్ని ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ నుంచి ముజఫర్‌పుర్‌కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులు ఝార్ఖండ్‌కు చెందినవారని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు