Instagram Reels: ఇన్‌స్టా రీల్‌ కోసం కారు బానెట్‌పై యువతి

ఇన్‌స్టాగ్రాంలో లైక్స్‌, కామెంట్స్‌, వ్యూస్‌ కోసం కొందరు యువతీ యువకులు ఎంతటి సాహసాలు చేయటానికైనా వెనుకాడట్లేదు.

Updated : 22 May 2023 07:53 IST

ఇన్‌స్టాగ్రాంలో లైక్స్‌, కామెంట్స్‌, వ్యూస్‌ కోసం కొందరు యువతీ యువకులు ఎంతటి సాహసాలు చేయటానికైనా వెనుకాడట్లేదు. కొందరు కొండలపైకి ఎక్కి వీడియోలు చేస్తే.. మరికొందరు రైల్వేట్రాక్స్‌పై ప్రమాదకర రీతుల్లో రీల్స్‌ చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి ఏకంగా ప్రధాన రహదారిపై వెళుతున్న కారు బానెట్‌పై కూర్చొని ఇన్‌స్టా రీల్‌ చేసింది. ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలోని సివిల్‌లైన్‌ ఏరియాకు చెందిన వర్ణిక.. సఫారీ లగ్జరీ కారు బానెట్‌పై కూర్చొని మరీ ఓ ప్రఖ్యాత పాటకు రీల్‌ చేసింది. పెళ్లికుమార్తె వేషధారణలో పోజులిచ్చింది. షూట్‌ చేసిన ఈ రీల్‌ను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారి ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు ఆమెకు షాకిచ్చారు. వీడియోలో కనిపించిన వాహనం నంబరు ప్లేటు ఆధారంగా యువతి వివరాలను గుర్తించారు. ఆమెకు రూ.15,500 జరిమానా విధించి హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని