కునో పార్కులో ఆగని చీతాల మరణాలు

మన దేశం చేపట్టిన చీతాల ప్రాజెక్టుకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కుకు తీసుకొచ్చిన 20 చీతాల్లో మూడు ఇప్పటికే చనిపోయాయి.

Updated : 26 May 2023 06:04 IST

 మరో రెండు కూనల మృత్యువాత

భోపాల్‌: మన దేశం చేపట్టిన చీతాల ప్రాజెక్టుకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కుకు తీసుకొచ్చిన 20 చీతాల్లో మూడు ఇప్పటికే చనిపోయాయి. చీతాలు ఇక్కడికి వచ్చిన తర్వాత పుట్టిన మరో మూడు కూనలు కూడా మృత్యువాత పడ్డాయి. మంగళవారం ఓ చీతా కూన మృత్యువాత పడగా..గురువారం మరో రెండు చీతా కూనలు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ‘నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘జ్వాల’ అనే చీతాకు రెండు నెలల క్రితం నాలుగు కూనలు పుట్టాయి. పార్కు ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితుల్లో కూనలు నీరసించిపోయినట్లు పర్యవేక్షకులు గుర్తించారు. పశువైద్యులు వాటికి అవసరమైన చికిత్స అందించారు. పరిస్థితి విషమించి.. మంగళవారం నాడు ఒకటి, గురువారం మరో రెండు కూనలు మృత్యువాతపడ్డాయి. 

కంచె అవసరం: నిపుణుడు

కునో పార్కులో చీతాలు స్వేచ్ఛగా సంచరించడానికి కంచెలు నిర్మించాలని దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన అటవీ జంతువుల నిపుణుడు విన్సెంట్‌ వాన్‌ డెర్‌ మెర్వే తెలిపారు. ఈ ప్రాంతంలో ఇతర జంతువులు, మనుషుల సంచారాన్ని నివారించడానికి ఈ చర్య అవసరమన్నారు. రాబోయే రోజుల్లో మరికొన్ని చీతాలు మృత్యువాత పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని