మెడకు గుచ్చుకొన్న కత్తితోనే బైక్ నడుపుతూ ఆస్పత్రికి..
ముంబయి వ్యాపారవేత్త తేజస్ పాటిల్ (32)పై సొంత సోదరుడు, మరో వ్యక్తి కలిసి కత్తితో దాడి చేశారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న తేజస్ మెడ భాగంలో కత్తి గుచ్చుకుపోయి తీవ్రంగా రక్తస్రావం అవుతున్నా ఒక కిలోమీటరు బైక్‌పై ప్రయాణించి ఆస్పత్రికి చేరుకున్నాడు.
ముంబయి వ్యాపారవేత్త తేజస్ పాటిల్ (32)పై సొంత సోదరుడు, మరో వ్యక్తి కలిసి కత్తితో దాడి చేశారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న తేజస్ మెడ భాగంలో కత్తి గుచ్చుకుపోయి తీవ్రంగా రక్తస్రావం అవుతున్నా ఒక కిలోమీటరు బైక్‌పై ప్రయాణించి ఆస్పత్రికి చేరుకున్నాడు. నవీ ముంబయిలోని సాన్‌పాడా సెక్టార్ 5లో నివసించే తేజస్ జూన్ 3వ తేదీ రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా.. తమ్ముడు మోనీశ్ (30) మరో వ్యక్తితో కలిసి అన్నపై దాడి చేశాడు. మెడపై కత్తితో పొడిచి.. నిందితులు ఇద్దరూ పరారరయ్యారు. తీవ్రమైన నొప్పి భరిస్తూ అలాగే ఆసుపత్రికి చేరుకొన్న తేజస్‌కు వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి కత్తిని తొలగించారు. మెడపై దాడి జరిగినా.. ముఖ్యమైన నరాలు దెబ్బతినలేదు. దీంతో తేజస్ ప్రాణాలతో బయటపడ్డారని వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!