మమతపై భాజపా నేత అభ్యంతరకర వ్యాఖ్యలు

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని కించపరుస్తూ ఆ రాష్ట్ర భాజపా నేత దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యలు చేసినట్లు ఒక వీడియో క్లిప్‌ వెలుగులోకి వచ్చింది.

Published : 27 Mar 2024 04:21 IST

ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని కించపరుస్తూ ఆ రాష్ట్ర భాజపా నేత దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యలు చేసినట్లు ఒక వీడియో క్లిప్‌ వెలుగులోకి వచ్చింది. ఘోష్‌ తీరును ఖండించిన తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. అదేవిధంగా దిలీప్‌పై చర్యలు తీసుకోవాలంటూ  రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బెంగాల్‌కు స్థానిక వ్యక్తే కావాలంటూ టీఎంసీ ఇచ్చిన నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘గోవాకు వెళ్లినప్పుడు నేను గోవా బిడ్డను అని చెప్తారు. త్రిపురలో ఉన్నప్పుడు త్రిపుర పుత్రికను అంటారు. మొదట దీనిపై ఆమె స్పష్టత ఇవ్వాలి..’ అంటూ దిలీప్‌ ఘోష్‌ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. దీనిపై తృణమూల్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని బెంగాల్‌ మంత్రి శశి పంజా డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దిలీప్‌ ఘోష్‌.. భాజపా బెంగాల్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. ఆయన మేదినీపుర్‌ సిట్టింగ్‌ ఎంపీ. ఈసారి బర్దమాన్‌-దుర్గాపుర్‌ నియోజకవర్గం నుంచి పార్టీ ఆయనకు టికెట్‌ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని