పత్రికాస్వేచ్ఛ అణచివేత ధోరణి తగదు

పత్రికాస్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌కు లేఖ రాసింది.

Published : 30 Apr 2024 04:49 IST

కేంద్ర మంత్రికి ఎడిటర్స్‌ గిల్డ్‌ లేఖ

దిల్లీ: పత్రికాస్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌కు లేఖ రాసింది. హిందీ యూట్యూబ్‌ న్యూస్‌ ఛానల్‌ ‘బోల్తా హిందుస్థాన్‌’ను కేంద్ర మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు నిలిపివేయడంపై గిల్డ్‌ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. కేంద్రం నుంచి అందిన నోటీసు మేరకు యూట్యూబ్‌ లీగల్‌ సపోర్ట్‌ టీం ఏప్రిల్‌ 4న ఆ ఛానల్‌కు సమాచారం అందించిందని, ఆ వెంటనే ఛానల్‌ ఖాతాను రద్దు చేసినట్లు తెలిపింది. గోప్యంగా ఉంచాల్సిన నోటీసు వివరాలు వెల్లడించలేమంటూ యూట్యూబ్‌ ఆ ఛానల్‌కు సమాచారం ఇచ్చిందన్నారు. మూడు లక్షల చందాదారులు, 80 లక్షల వ్యూయర్లు ఉన్న ‘బోల్తా హిందుస్థాన్‌’కు చేసిన తప్పిదం ఏమిటో చెప్పలేదని, కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని గిల్డ్‌ పేర్కొంది. మరికొన్ని ఉదంతాల్లోనూ కొన్ని వార్తాసంస్థల ఆన్‌లైన్‌ కంటెంట్‌ నిలిపివేతకు గూగుల్‌, యూట్యూబ్‌లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇదేవిధమైన ఆదేశాలు జారీ చేసినట్లు లేఖలో మంత్రి దృష్టికి తెచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని