ఆసుపత్రుల్లో రుసుముల నిర్ధారణపై మీ వైఖరేంటి?

ఆసుపత్రుల్లో వైద్యసేవల రుసుములను నిర్ధారించే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (సెంట్రల్‌ గవర్నమెంట్‌) రూల్స్‌-2012లోని 9వ నిబంధనను అమలు చేయరాదన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది.

Updated : 30 Apr 2024 07:11 IST

కేంద్ర ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీంకోర్టు

దిల్లీ: ఆసుపత్రుల్లో వైద్యసేవల రుసుములను నిర్ధారించే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (సెంట్రల్‌ గవర్నమెంట్‌) రూల్స్‌-2012లోని 9వ నిబంధనను అమలు చేయరాదన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది. సంబంధిత నిబంధన ప్రకారం.. రోగులకు అందించిన సేవలకు వసూలు చేసే రుసుములు కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన రేట్లకు లోబడి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాల సలహా మేరకు కేంద్రం వీటిని రూపొందిస్తుంది. అయితే ఒకేరకమైన రుసుములను ఎలా నిర్ధారిస్తారని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘మార్కెట్‌ అంశాలపై అది ఆధారపడి ఉంటుంది కదా? ఒక వైద్యుడు రూ.10వేలు వసూలు చేయవచ్చు.. మరో డాక్టర్‌ రూ.వెయ్యి అడగొచ్చు’’ అని పేర్కొంది. ఈ అంశంపై నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. రోగుల నుంచి వసూలు చేసే రుసుములను నిర్ధారించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ ఇప్పటికే దాఖలైన మరో పిటిషన్‌తో కలిపి తాజా వ్యాజ్యాన్ని విచారిస్తామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని