
Published : 28 Jan 2022 01:43 IST
Drone Certification: ఇకపై డ్రోన్లకు ధ్రువపత్రం కావాలంటే.. ఆ వివరాలన్నీ సమర్పించాల్సిందే!
దిల్లీ: కనీస భద్రత, నాణ్యత ప్రమాణాల సాధనే లక్ష్యంగా డ్రోన్ల ధ్రువీకరణ పథకంపై పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. ఇకపై ధ్రువపత్రం కావాలని దరఖాస్తు చేసుకునేవారు.. డ్రోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. డ్రోన్ బరువు, వేగం, పరిధి, మన్నిక, డ్రోన్‌ను వెనక్కి రప్పించే యంత్రాంగం, తయారీలో వాడిన సామగ్రి తదితర వివరాలన్నీ అందించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. డ్రోన్లకు ధ్రువీకరణను సులభంగా, వేగంగా, పారదర్శకంగా అనుమతులు ఇచ్చేందుకు తాజా ఆదేశాలు దోహదపడుతాయని పేర్కొంది. దిగుమతిదారులకు, విడిభాగాలను తెచ్చి ఒకటిగా అమర్చేవారికి తాజా ఆదేశాలు వర్తిస్తాయని పౌర విమానయానశాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి
Tags :