Corona: మృతుల లెక్కలు తేల్చండి

బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలోని గంగా నదిలో మృతదేహాలను గుర్తించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో కరోనాతో మరణించిన వారి సంఖ్యలో వ్యత్యాసాలు గుర్తించినట్లు పట్నా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 19 May 2021 00:01 IST

అధికారులను ఆదేశించిన పట్నా హైకోర్టు


పట్నా: బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలోని గంగా నదిలో మృతదేహాలను గుర్తించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో కరోనాతో మరణించిన వారి సంఖ్యలో వ్యత్యాసాలు గుర్తించినట్లు  హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్‌లో కొవిడ్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్న హైకోర్టుకు ప్రభుత్వాధికారులు సమర్పించిన అఫిడవిట్లలో ఈ వ్యత్యాసాలను గుర్తించినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి త్రిపురారి శరణ్‌ నివేదికలో బక్సర్‌ జిల్లాలో మార్చి 1 నుంచి ఆరుగురు మాత్రమే కరోనా మరణించారని పేర్కొనగా, డివిజినల్‌ కమిషనర్‌ ప్రకటనలో మే 5 నుంచి మే 14 వరకు ఒక్క చార్‌ధామ్‌ శ్మశానవాటికలోనే 789 అంత్యక్రియలు జరిగినట్లు చూపిస్తోంది. దీనిపై ఆగ్రహించిన హైకోర్టు రెండు రోజుల్లోగా సరైన వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రధాన వైద్య కార్యదర్శిని ఆదేశించింది. మృతుల వయసుతో సహా అన్ని వివరాలు అందులో పొందు పర్చాలని పేర్కొంది. 17లక్షల జనాభా ఉన్న బక్సర్‌ జిల్లాలో కేవలం ఒక్క శ్మశానవాటికలో పదిరోజుల వ్యవధిలో 789 అంత్యక్రియలు జరడం మొత్తం జిల్లాలో కరోనా పరిస్థితికి అద్దం పడుతోందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను ప్రశ్నించింది. అంతే కాకుండా రాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌లో కరోనా మరణాల సంఖ్యను నమోదు చేయడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని