ISRO: ఈ ఏడాది తొలిదశ ప్రయోగానికి ఇస్రో సిద్ధం..

భారత అంతరిక్ష రాకెట్ ప్రయోగ పరిశోధన కేంద్రం(ఇస్రో) నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి..

Published : 09 Feb 2022 20:00 IST

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి.. ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. వాతావరణం అనుకూలిస్తే.. ఈనెల 14న ఉదయం 5.59 గంటలకు రాకెట్ దూసుకెళ్లనుంది. మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-52 వాహక నౌకను ప్రయోగించనున్నారు. వాహకనౌకలో 4 దశల అనుసంధానం పూర్తి చేసి.. ఇవాళ శిఖర భాగాన ఉష్ణకవచం చేపట్టనున్నారు. ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ ఈనెల 13న వేకువజామున 4.29 గంటలకు ప్రారంభమవుతుంది. నిరంతరాయంగా 25.30 గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన తర్వాత వాహననౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఐఆర్‌శాట్-1-ఏతో పాటు ఐఎన్‌ఎస్‌-2-టి.డి, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-52 మోసుకెళ్లనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని