West bengal: కోల్‌కతా మున్సిపల్‌ ఎన్నికల్లో పెట్రోల్‌ బాంబుదాడులు

కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌(కేఎంసీ) ఎన్నికల్లో ఆదివారం హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌ కేంద్రాలకు వెలుపల పెట్రోల్‌ బాంబులు విసిరిన ఘటనల్లో పలువురు గాయపడ్డారు. సీల్దహ్‌, ఖన్నా అనే రెండు ప్రాంతాల్లో బాంబులు....

Published : 19 Dec 2021 16:12 IST

కోల్‌కతా: కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌(కేఎంసీ) ఎన్నికల్లో ఆదివారం హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌ కేంద్రాలకు వెలుపల పెట్రోల్‌ బాంబులు విసిరిన ఘటనల్లో పలువురు గాయపడ్డారు. సీల్దహ్‌, ఖన్నా అనే రెండు ప్రాంతాల్లో బాంబులు విసిరిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు. పెట్రోల్‌ బాంబులు విసిరిన ఘటనలో ఒక్కరు మాత్రమే గాయపడ్డారని ఎస్‌ఈసీ అధికారులు తెలపగా, పోలీసులు మాత్రం ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని, ఒకరు కాలు పోగొట్టుకున్నారని వెల్లడించారు. అధికార తృణమూల్‌.. ప్రతిపక్ష పార్టీలకు  చెందిన పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి రానీకుండా అడ్డుకున్నారని భాజపా, సీపీఎం పార్టీలు ఆరోపించాయి. తమ పోలింగ్‌ ఏజెంట్లను బూత్‌లలోకి అనుమతించడం లేదని ఆరోపిస్తూ సీపీఎం కార్యకర్తలు భాగాజతిన్‌ ప్రాంతంలో రహదారిని దిగ్భందించారు. తమపై తృణమూల్‌ కార్యకర్తలు దాడి చేశారని భాజపా సిట్టింగ్‌ కౌన్సిలర్‌ మినాదేవి పురోహిత్‌ ఆరోపించారు. ఇంకా పలుచోట్ల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తమ పార్టీ ఏజెంట్లను, కార్యకర్తలను కొట్టారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. అధికార తృణమూల్‌ నాయకులు దీనిని ఖండించారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా బల ప్రయోగానికి పాల్పడినా, హింసాత్మక ఘటనలకు కారణమైనా వారిని పార్టీ నుంచి తొలగిస్తామని తృణమూల్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని