లష్కరే ముస్తఫా ఉగ్ర నాయకుడి అరెస్టు

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన లష్కరే ముస్తఫా ఉగ్రవాద సంస్థ నాయకుడు హిదాయతుల్లా మాలిక్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జమ్మూ, అనంతనాగ్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్‌  పోలీ

Published : 07 Feb 2021 00:52 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన లష్కరే ముస్తఫా ఉగ్రవాద సంస్థ నాయకుడు హిదయతుల్లా మాలిక్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జమ్మూ, అనంతనాగ్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్‌  పోలీసు అధికారి శ్రీధర్‌ పాటిల్‌ వెల్లడించారు. ‘జమ్మూలోని కుంజ్వానీ ప్రాంతంలో లష్కరే ముస్తాఫా ఉగ్ర సంస్థ నాయకుడు హిదయతుల్లా మాలిక్‌ను అరెస్టు చేశాం. అతడి వద్ద నుంచి పిస్టల్‌, గ్రనేడ్‌ ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై మాలిక్‌ దాడికి తెగబడ్డాడు’ అని పాటిల్‌ తెలిపారు. ఈ లష్కరే ముస్తఫా ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్‌లో పాక్‌కు చెందిన జైషే మహమ్మద్‌కు అనుబంధ శాఖలా పనిచేస్తోందని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి

దేశవ్యాప్తంగా ముగిసిన చక్కా జామ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని