కోర్టు ప్రాంగణంలో చిరుత హల్‌చల్‌.. ముగ్గురికి గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని కోర్టులో ఓ చిరుత హల్‌చల్‌ చేసింది.  అక్కడున్న వారిపై దాడి చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయి.

Published : 08 Feb 2023 23:59 IST

గజియాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ కోర్టు (Ghaziabad Court) ప్రాంగణంలో ఓ చిరుత (Leopard) హల్‌చల్‌ చేసింది. మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా చిరుత కోర్టు ఆవరణంలో ప్రత్యక్షమవ్వడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. జనాలను చూసిన ఆ చిరుత మరింత గందరగోళానికి గురయ్యింది. ఈ క్రమంలో అటూ ఇటూ పరుగెత్తుతూ అక్కడున్న వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.

ఘజియాబాద్‌ కోర్టులోకి చిరుత ప్రవేశించిన విషయాన్ని అక్కడి అటవీ అధికారులకు తెలియజేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు.. చిరుతను బంధించేందుకు ఓ బృందాన్ని అక్కడికి పంపించారు. అయితే, ఇప్పటికీ ఆ చిరుతను బంధించలేదని.. బోనులోకి వచ్చిన వెంటనే దానిని తరలించేందుకు ఏర్పాట్లు చేశామని స్థానిక అటవీ అధికారి సంజయ్‌ చన్నే వెల్లడించారు. కోర్టు ప్రాంగణంలో చిరుత తిరుగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు