Manipur: మణిపుర్‌ సీఎం నివాసానికి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టిన ఆందోళనకారులు

మణిపుర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌ ఇంటి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆందోళనకారులు చుట్టుముట్టారు. 

Published : 01 Nov 2023 22:51 IST

ఇంఫాల్‌: జాతుల మధ్య వైరంతో గత కొన్ని నెలలుగా అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్ర సీఎం బీరేన్‌సింగ్‌ నివాసానికి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆందోళనకారులు చుట్టుముట్టారు. స్టేషన్‌లోని ఆయుధాలను లూటీ చేసేందుకు యత్నించగా.. పోలీసులు పలుమార్లు గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఇంఫాల్‌ పట్టణంలో కర్ఫ్యూ విధించారు.

బెంగళూరు వాసులను హడలెత్తించిన చిరుత మృతి

మంగళవారం మోరే ప్రాంతంలో హెలిప్యాడ్‌ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోన్న సమయంలో చొరబాటుదారులు ఆనంద్‌ అనే పోలీసు అధికారిని కాల్చిచంపారు. ఆయన సబ్‌ డివిజనల్‌ అధికారి(SDPO) హోదాలో ఉన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఆ అధికారి చనిపోయారని స్థానిక యువజన సంఘం అరంబై తెంగ్‌గోల్‌ ఆధ్వర్యంలో ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్‌ ముట్టడికి యత్నించారు. యువకులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో భద్రతా దళాలకు వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆందోళనకారులు ఆయుధాల కోసం డిమాండ్ చేస్తూ మణిపుర్‌ రైఫిల్‌ కాంప్లెక్స్‌ను చుట్టుముట్టారు. వారిని కట్టడి చేసేందుకు భద్రతా సిబ్బంది, పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. అక్కడ జరిగిన తోపులాట కారణంగా కొందరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని