PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం

తమిళనాడులోని సేలంలో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ నాయకుడి సేవలను గుర్తుచేసుకుని ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

Published : 19 Mar 2024 17:07 IST

చెన్నై: లోక్‌సభ ఎన్నికల (LokSabha Elections 2024) ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) వరుసగా వేర్వేరు రాష్ట్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మంగళవారం తమిళనాడు (Tamil Nadu)లోని సేలం జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పదేళ్ల క్రితం సేలం జిల్లాలో హత్యకు గురైన భాజపా (BJP) నాయకుడు వి.రమేశ్‌ను గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో కొద్దిసేపు తన ప్రసంగాన్ని నిలిపి తిరిగి ప్రారంభించారు. ‘‘ఆడిటర్‌ రమేశ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతం ఆయన మనతో లేరు. ఆయనో గొప్ప వక్త. రాత్రింబవళ్లు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. కానీ, ఆయన హత్యకు గురయ్యారు. సభాముఖంగా నేను ఆయనకు నివాళి అర్పిస్తున్నా’’ అని ప్రధాని మోదీ అన్నారు. 

అమితాబ్‌ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

వృత్తిరీత్యా ఆడిటర్‌ అయిన రమేశ్‌ గతంలో తమిళనాడు రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2013 జులైలో ఆయనను నివాసంలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇదే సభలో మరో భాజపా నాయకుడు కేఎన్‌ లక్ష్మణన్‌ సేవలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. తమిళనాడులో పార్టీ బలపడేందుకు ఆయన ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. అంతకుముందు డీఎంకే, కాంగ్రెస్‌లపై విమర్శలు చేశారు. ఇండియా కూటమి పార్టీలు మహిళలు, హిందుత్వాన్ని అవమానిస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఆ కూటమిని ప్రజలు ఓడిస్తారని ప్రధాని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని