PM Modi: ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌

ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం పేర్కొంది.

Updated : 12 Dec 2021 10:37 IST

దిల్లీ: ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా కొద్ది సమయం హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం పేర్కొంది. అయితే కొంతసేపటి తర్వాత ట్విటర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది.  మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాలో అగంతకులు బిట్‌కాయిన్‌ను ఉద్దేశిస్తూ పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్‌ చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్‌లు కొనుగోలు చేసి,ప్రజలకు పంచుతోందని హ్యాకర్లు లింక్‌లు పోస్టు చేశారు. దీంతో వెంటనే పీఎంవో అధికారులు స్పందించి ట్విటర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ట్వీట్‌ను తొలగించారు. అనంతరం ట్విటర్‌ ఖాతాను పునరుద్ధరించారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.  ఈ సమయంలో ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయిందని, ఆ ఖాతాలో ఏవైనా ట్వీట్‌లు పోస్టులు చేస్తే  స్వల్పకాలం పాటు స్పందించవద్దని  పేర్కొంది.    



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని