Nalini: ఆ విషయాలు తెలుసుకొని.. ప్రియాంక కన్నీటి పర్యంతమయ్యారు: నళిని
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవించిన నళిని శ్రీహరన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. 2008లో ప్రియాంక గాంధీ వాద్రా తనను జైలులో కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు (Rajiv Gandhi Assassination)లో మూడు దశాబ్దాల పాటు శిక్ష అనుభవించిన నళిని శ్రీహరన్‌తో సహా ఇతర దోషులు (Nalini Sriharan) జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన నళిని.. 2008లో ప్రియాంక గాంధీ వాద్రా తనను జైలులో కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తండ్రి మరణం రోజున ఏం జరిగిందనే విషయాలను ప్రియాంక గాంధీ అడిగి తెలుసుకున్నారని.. ఆ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారని వివరించారు.
‘2008లో వెల్లూరు సెంట్రల్ జైలులో ప్రియాంక గాంధీ నన్ను కలిశారు. ఆమె ఎంతో దయగల వ్యక్తి. ఆమె ఒక దేవత. ఆమె నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడారు. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య గురించి కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో భావోద్వేగానికి గురై ఏడ్చారు కూడా’ అని నళిని వెల్లడించారు. హత్య కేసులో పాత్రపై అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన నళిని.. అందులో తన పాత్ర ఏమీ లేదన్నారు. ఆ బృందంతో తనకు పరిచయం ఉన్న కారణంగా దోషిగా తేలానని.. అందుకు శిక్ష అనుభవించానన్నారు. అయినప్పటికీ, అసలు నిజమేంటో నా అంతరాత్మకే తెలుసునంటూ నళిని శ్రీహరన్ చెప్పారు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష పడి వేలూరు జైలులో ఉన్న నళిని, మురుగన్, సంథన్లు శనివారం విడుదల కాగా.. చెన్నై పుళల్ జైలు నుంచి రాబర్ట్ ఫయాజ్, జయకుమార్, తిరుచ్చి కారాగారం నుంచి రవిచంద్రన్‌లు విడుదలయ్యారు. వీరిలో మురుగన్, సంథన్, రాబర్ట్ ఫయాజ్, జయకుమార్‌లు శ్రీలంక జాతీయులు కావడంతో వారిని భారీ పోలీసు బందోబస్తుతో తిరుచ్చిలో ఉన్న శ్రీలంక శరణార్థుల శిబిరానికి తరలించారు. నళినిని మాత్రం చెన్నైలో ఉన్న ఆమె తల్లి వద్దకు తీసుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
జమ్మూ-కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో అయిదుగురు జవాన్లు గాయపడ్డారు. -
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్‌ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
మహిళ అపహరణ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. -
సందేశ్‌ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
సందేశ్‌ఖాలీ ఘటనలు భాజపా ముందస్తు కుట్రేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి భాజపా చేసే విమర్శలను ఆప్(AAP) తిప్పికొట్టింది. తనవారి కోసమే ఆ పార్టీ పని చేస్తుందని దుయ్యబట్టింది. -
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఏకంగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికారులను షాక్‌కు గురిచేసింది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్‌భూషణ్ హడావుడి
తన కుమారుడు నామినేషన్ వేసిన సందర్భంగా భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) తన బలాన్ని ప్రదర్శించారు. వేల సంఖ్యలో మద్దతుదారులతో భారీ సభను నిర్వహించారు. -
పహిల్వాన్‌ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్‌లో ఉన్న హమీదా బాను ఎవరు?
Hamida Banu: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్ హమీదా బాను. ఇంతకీ ఎవరామే? ఏంటామె ప్రత్యేకత? -
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
ముందు రాయ్‌బరేలీలో గెలువు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన పోస్టుపై గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) వివరణ ఇచ్చారు. -
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్‌లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్‌కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్‌గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్‌ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్‌గఢ్‌లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్‌గఢ్‌లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్‌లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ