Flu: ‘ఫ్లూ’ భయం భయం.. అక్కడ పాఠశాలల మూసివేత

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిని జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు ఈ ఫ్లూ బారిన పడుతున్నారు. ప్రతిరోజు 150 మంది పిల్లలు జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు........

Published : 19 Sep 2022 01:39 IST

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిని జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు ఈ ఫ్లూ బారిన పడుతున్నారు. ప్రతిరోజు 150 మంది పిల్లలు జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఫ్లూ భయంతో శనివారం 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సెలవులు ప్రకటించిన స్థానిక ప్రభుత్వం.. తాజాగా ఎల్‌కేజీ, యూకేజీ చిన్నారుల తరగతులను కూడా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. సెలవులు ప్రకటించాలని ఆరోగ్య శాఖ సిఫార్సు చేయగా.. విద్యాశాఖ డైరెక్టరేట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి, విద్యాశాఖ ఇన్‌ఛార్జ్‌ హోంమంత్రి ఏ.నమశ్శివాయం ఆమోదం తెలిపారు. సెప్టెంబర్ 25వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి.

కాగా ఈ జ్వరాలపై హెల్త్‌ డైరెక్టర్‌ మాట్లాడారు. ‘గత వారం రోజుల నుంచి జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరే చిన్నారుల సంఖ్య పెరిగిపోయింది. పుదుచ్చేరి, కరైకల్‌తోపాటు పలు ప్రాంతాల్లోని దవాఖానాల్లో ప్రతిరోజు 150కి పైగా మంది చేరుతున్నారు’ అని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అన్ని పీహెచ్‌సీలు, ప్రధాన ఆసుపత్రుల్లో ఫ్లూ క్లినిక్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని