Vladimir Putin: బైడెన్‌కు పుతిన్‌ హెచ్చరిక..!

ఉక్రెయిన్‌ పరిణామాల నేపథ్యంలో తమ దేశంపై కొత్త ఆంక్షలు విధిస్తే అమెరికాతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించారు.

Published : 31 Dec 2021 22:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ పరిణామాల నేపథ్యంలో తమ దేశంపై కొత్త ఆంక్షలు విధిస్తే అమెరికాతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించారు. గురువారం అర్ధరాత్రి పుతిన్‌ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌కాల్‌లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రష్యాపై ఆంక్షల విధించడం ఘోరమైన తప్పుగా నిలుస్తుందని హెచ్చరించారు.

రష్యా అభ్యర్థన మేరకు ఈ సమావేశానికి ఏర్పాట్లు జరిగాయి. ఇరు పక్షాల నేతలు దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించే ఉద్దేశం లేదని రష్యా చెప్పింది. తమ సొంత భూభాగంలో దళాలు స్వేచ్ఛగా తిరగడానికి హక్కుఉందని రష్యా చెబుతోంది. 

ఈ చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ ఆక్రమణకు పాల్పడితే అమెరికా మిత్రపక్షాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయని వెల్లడించారు. ఇటీవల అమెరికా మిత్రపక్షాలు రష్యాను హెచ్చరించాయి కూడా. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తే పుతిన్‌ ఎన్నడూ చూడని స్థాయిలో ఆంక్షలను చవిచూస్తారని పేర్కొన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని