supreme court: మహారాష్ట్రలోనూ ఎడ్లబండ్ల రేసింగ్‌లకు ‘సుప్రీం’ అనుమతి

Published : 16 Dec 2021 23:30 IST

 

దిల్లీ: మహారాష్ట్రలో సంప్రదాయ ఎద్దుల బండ్ల రేసింగ్‌లకు  అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఎద్దుల బండ్ల పందేలకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన ద్విసభ్య ధర్మాసనం పందేలకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి క్రీడలు జరుగుతున్నందున రాష్ట్రంలో మాత్రం  నిషేధం విధించడం అర్థ రహితమని పేర్కొన్నారు. మనది ఒకే దేశం, ఒకే జాతి అయినందున ఏకరూపత ఉండాలన్న అభిప్రాయం ధర్మాసనం వ్యక్తం చేసింది. ఇది ఒక సంప్రదాయ క్రీడ అని చాలా సంవత్సరాల పాటు కొనసాగినట్లు తెలిపింది. కోర్టు తీర్పు కారణంగా ఆగినట్లు  ప్రస్తుతం సవరణలతో అనుమతిస్తున్నట్లు తెలిపారు.  దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు కేవలం మహారాష్ట్రలో  మాత్రం ఆపడం ఇంగిత జ్ఞానం కాదని పేర్కొంది. జల్లికట్టు, ఎద్దుల బండ్ల పోటీలను అనుమతిస్తూ 2014లో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత  జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం (పీసీఏ)కింద తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సవరణ తీసుకువచ్చినట్లు  ధర్మాసనం పేర్కొంది. మహారాష్ట్ర కూడా 2017లో పీసీఏ చట్టాన్ని సవరించి రేసును అనుమతించగా బాంబే హైకోర్టు అనుమతించని విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఇతర రాష్ట్రాలలో చేసిన సవరణల మాదిరిగానే మహారాష్ట్రలోనూ నిబంధనలకు లోబడి రేసింగ్‌లకు అనుమతించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ రేసింగ్‌లకు అనుమతిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని