మాల్యాను రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు!

రూ. 9వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే కొన్ని న్యాయపరమైన

Published : 18 Jan 2021 23:00 IST

దిల్లీ: రూ. 9వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే కొన్ని న్యాయపరమైన సమస్యల వల్లే ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని వివరించింది. మాల్యా అప్పగింత అంశంపై నివేదిక సమర్పించేందుకు మరింత గడువు కావాలని ఈ సందర్భంగా కేంద్రం న్యాయస్థానాన్ని కోరింది. దీంతో తదుపరి విచారణను కోర్టు మార్చి 15కు వాయిదా వేసింది. 

ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులకు రూ. 9వేల కోట్ల రుణాలు ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా 2016లో యూకేకు పారిపోయిన విషయం తెలిసిందే. 2017లో ఆయనను స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. మాల్యాను భారత్‌కు అప్పగించే అంశంపై జరుగుతున్న విచారణ యూకే కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆయనను అప్పగింత ప్రక్రియపై ఆరు వారాల్లోగా స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని గతేడాది నవంబరు 2న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 

కొన్ని న్యాయపరమైన సమస్యల వల్లే ఈ కేసు విచారణ ఆలస్యమవుతోందని చెప్పిన యూకే.. ఆ సమస్యలేంటో మాత్రం బయటకు వెల్లడించడంలేదు. యూకే చట్టాల ప్రకారం.. ఆ సమస్యలు పరిష్కారమైతేనే మాల్యా అప్పగింత జరుగుతుందని ఆ దేశ ప్రభుత్వం చెప్పినట్లు కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇవీ చదవండి.. 

స్వీయ క్షమాభిక్షపై వెనక్కి తగ్గిన ట్రంప్‌!

శామ్‌సంగ్‌ వారసుడికి రెండున్నరేళ్ల జైలుశిక్ష

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని