India Corona: 9 నెలల కనిష్ఠానికి కొత్త కేసులు.. గణనీయంగా పెరిగిన రికవరీ రేటు
దేశంలో మరోసారి కరోనా కేసులు తగ్గాయి. 266 రోజుల కనిష్ఠానికి చేరి.. 10 వేలకు పడిపోయాయి. రికవరీ రేటు, క్రియాశీల రేటు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది.
దిల్లీ: దేశంలో మరోసారి కరోనా కేసులు తగ్గాయి. 266 రోజుల కనిష్ఠానికి చేరి.. 10 వేలకు పడిపోయాయి. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడగా.. క్రియాశీల రేటు క్రమంగా తగ్గుతోంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది.
సోమవారం 10,85,848 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,126 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కొత్త కేసులు ఫిబ్రవరి ప్రారంభం నాటి స్థాయికి తగ్గాయి. అలాగే కేరళ, తమిళనాడు, మిజోరం, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్.. కేసుల పరంగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
గత ఏడాది ప్రారంభం నుంచి దేశంలో 3.43 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న ఒక్కరోజే 11,982 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 1.40 లక్షలకు తగ్గింది. ఈ సంఖ్య 263 రోజుల కనిష్ఠానికి చేరింది. దాంతో క్రియాశీల రేటు 0.41 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.25 శాతానికి పెరిగింది. కేరళ గణాంకాలను సవరిస్తుండటంతో మరణాల సంఖ్య భారీగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 332 మరణాలు నమోదుకాగా.. అందులో 262 కేరళవే. ఇప్పటివరకు 4,61,389 మంది మహమ్మారికి బలయ్యారు. మరోవైపు నిన్న 59 లక్షల మందికిపైగా టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 109 కోట్ల మార్కును దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
జమ్మూ-కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో అయిదుగురు జవాన్లు గాయపడ్డారు. -
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్‌ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
మహిళ అపహరణ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. -
సందేశ్‌ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
సందేశ్‌ఖాలీ ఘటనలు భాజపా ముందస్తు కుట్రేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి భాజపా చేసే విమర్శలను ఆప్(AAP) తిప్పికొట్టింది. తనవారి కోసమే ఆ పార్టీ పని చేస్తుందని దుయ్యబట్టింది. -
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఏకంగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికారులను షాక్‌కు గురిచేసింది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్‌భూషణ్ హడావుడి
తన కుమారుడు నామినేషన్ వేసిన సందర్భంగా భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) తన బలాన్ని ప్రదర్శించారు. వేల సంఖ్యలో మద్దతుదారులతో భారీ సభను నిర్వహించారు. -
పహిల్వాన్‌ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్‌లో ఉన్న హమీదా బాను ఎవరు?
Hamida Banu: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్ హమీదా బాను. ఇంతకీ ఎవరామే? ఏంటామె ప్రత్యేకత? -
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
ముందు రాయ్‌బరేలీలో గెలువు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన పోస్టుపై గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) వివరణ ఇచ్చారు. -
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్‌లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్‌కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్‌గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్‌ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్‌గఢ్‌లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్‌గఢ్‌లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్‌లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ