Niti Aayog: వైద్య సేవలపరంగా మెరుగ్గా కేరళ.. చివరన యూపీ

మొత్తం వైద్య సేవల పరంగా ఉత్తమ పనితీరు ప్రదర్శించిన పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్‌ అట్టడుగు స్థానానికి పరిమితమైంది.

Published : 27 Dec 2021 23:44 IST

దిల్లీ: మొత్తం వైద్య సేవల పరంగా ఉత్తమ పనితీరు ప్రదర్శించిన పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్‌ అట్టడుగు స్థానానికి పరిమితమైంది. నీతి ఆయోగ్ నాల్గవ విడత ఆరోగ్య సూచీలను విడుదల చేసి, ఈ ర్యాంకులను ప్రకటించింది. అందుకు 2019-20 ఏడాదిని పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.  రెండు, మూడు స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయని పేర్కొంది. ముందు ఏడాదితో పోల్చితే పనితీరును మెరుగుపర్చుకొనే విషయంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముందువరుసలో నిల్చుందని చెప్పింది. 

చిన్న రాష్ట్రాల విషయంలో మిజోరం తొలిస్థానంలో ఉంది. మొత్తం వైద్య సేవల పరంగా, పనితీరును మెరుగు పర్చుకునే విషయంలో ఈ రాష్ట్రమే ముందుంది. ఉత్తమ పనితీరు పరంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిల్లీ, జమ్మూకశ్మీర్ చివరి స్థానాల్లో ఉన్నాయి. అయితే పనితీరును మెరుగుపర్చుకున్న విషయంలో మొదటి స్థానంలో నిలిచాయి. ఈ ఆరోగ్య సూచీ నివేదిక రూపకల్పనలో కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ బ్యాంకు భాగం పంచుకున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని