Air India: విమానంలో ప్రయాణికుడి మృతి.. దిల్లీలో అత్యవసర ల్యాండింగ్‌

దిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం 3గంటల తర్వాత మళ్లీ అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.....

Published : 04 Dec 2021 19:29 IST

దిల్లీ: దిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం 3గంటల తర్వాత మళ్లీ అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా విమానాన్ని తిరిగి ల్యాండ్‌ చేశారు. దిల్లీ నుంచి అమెరికాలోని నెవార్క్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న అమెరికా వాసి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి వైద్యం అందించాల్సిన నేపథ్యంలో విమానాన్ని తిరిగి దిల్లీకి తీసుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. మూడు గంటల ప్రయాణం తర్వాత ఫ్లైట్‌ దిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యింది.

అప్పటికే అక్కడ వేచిచూస్తున్న ఎయిర్‌పోర్టు వైద్యులు బాధితుడిని పరీక్షించి అతడు మరణించినట్లు తేల్చారు. గుండెపోటుతోనే మృతిచెంది ఉంటాడని వైద్యులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఇతర సిబ్బందితో ఆ విమానం సాయంత్రం తిరిగి బయలుదేరినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

 

Read latest National - International News and Telugu News

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని