Avalanche: కశ్మీర్‌లో విషాదం.. మంచు చరియలు విరిగిపడి ముగ్గురు జవాన్లు మృతి!

మంచు కొండల్లో విషాదం! జమ్మూ- కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం మంచు చరియలు(Avalanche) విరిగిపడిన ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.

Published : 19 Nov 2022 00:41 IST

శ్రీనగర్‌: మంచు కొండల్లో విషాదం! జమ్మూ- కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం మంచు చరియలు(Avalanche) విరిగిపడిన ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. 56 రాష్ట్రీయ రైఫిల్స్‌ చెందిన జవాన్ల బృందం ఎప్పటిలాగే శుక్రవారం పెట్రోలింగ్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే మంచు చరియలు విరిగి, వారిపై పడ్డాయి. హిమపాతంలో చిక్కుకుపోయిన ఇద్దరు సైనికులను రక్షించి, కుప్వారాలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పెట్రోలింగ్‌లో ఉన్న మరో సైనికుడు హైపోథర్మియా(శరీర ఉష్ణోగ్రత పడిపోవడం)కు గురయ్యాడు. దీంతో అతడిని సైతం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే, ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని రక్షణశాఖ శ్రీనగర్‌ పౌర సంబంధాల అధికారి వెల్లడించారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. అక్టోబర్‌లోనూ ఉత్తరాఖండ్‌లో సంభవించిన హిమపాతం కారణంగా 27 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని