ప్రేమ పెళ్లి చేసుకున్న మంత్రి కుమార్తె.. రక్షణ కోసం పోలీసుస్టేషన్‌కు జంట

తమిళనాడులో ఓ మంత్రి కుమార్తె ప్రేమ వివాహం చర్చనీయాంశంగా మారింది. తన పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మంత్రి కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం

Published : 09 Mar 2022 11:31 IST

బెంగళూరు: తమిళనాడులో ఓ మంత్రి కుమార్తె ప్రేమ వివాహం చర్చనీయాంశంగా మారింది. తన పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మంత్రి కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. అయితే, కుటుంబానికి భయపడి రక్షణ కోసం ఆ జంట పోలీసు స్టేషన్‌కు వెళ్లడంతో ఈ వ్యవహారం కాస్తా ఆ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. 

తమిళనాడు మంత్రి పి.కె. శేఖరబాబు కుమార్తె జయ కల్యాణి వృత్తిరీత్యా డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు సతీశ్‌ కుమార్‌ అనే వ్యాపారితో పరిచయమై ప్రేమకు దారితీసింది. తాము ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నట్లు జయ కల్యాణి తెలిపారు. అయితే, వీరి వివాహానికి మంత్రి కుటుంబం అంగీకరించలేదు. దీంతో ఈ జంట ఇంటి నుంచి వెళ్లిపోయి కర్ణాటకలోని ఓ మఠంలో వివాహం చేసుకొంది. ఆ తర్వాత తమ పెళ్లి వీడియోను మీడియాకు విడుదల చేసింది. 

మరోవైపు తన కుమార్తె కన్పించడం లేదని, కొందరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్‌ చేశారని మంత్రి శేఖరబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ జంట బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. తమిళనాడు పోలీసులు తమకు సాయం చేయడం లేదని, తన తండ్రి బెదిరిస్తున్నారని జయకల్యాణి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని