Twitter Down: కొద్దిసేపు నిలిచిన ట్విటర్ సేవలు

గురువారం ఉదయం సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ సేవలకు కొద్దిసేపు ఆటంకం కలిగింది.

Published : 01 Jul 2021 10:56 IST

దిల్లీ: సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ సేవలకు గురువారం ఉదయం కొద్దిసేపు ఆటంకం కలిగింది. దాంతో ‘ట్విటర్‌ డౌన్‌’ అంటూ వినియోగదారుల వ్యక్తిగత ఖాతాల్లో సందేశాలు వెల్లువెత్తాయి. ట్విటర్ వేదికగా సందేశాలు పంపించేందుకు, చూసేందుకు అంతరాయం కలిగినట్లు నెటిజన్లు వెల్లడించారు.  కొందరు తమ టైమ్‌లైన్‌ను వీక్షించడం సాధ్యంకాలేదని చెప్పగా.. మరికొందరు తమ పర్సనల్‌ కంప్యూటర్లలో ట్విటర్‌ను యాక్సెస్ చేయడం వీలుకాలేదన్నారు. మొబైల్‌ ఫోన్లలో ఈ సమస్య ఎదురుకానట్లు తెలుస్తోంది. మరోపక్క తాము సమస్యను పరిష్కరిస్తున్నట్టు ట్విటర్ వినియోగదారులకు సమాచారం ఇచ్చింది. 

80 శాతం మంది వినియోగదారులకు ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఈ సమస్య ఎదురైనట్లు అవుటేజ్‌ మానిటరింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్ నివేదిక వెల్లడించింది. ఒక గంటపాటు ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అలాగే భారత్‌తో పాటు చాలా దేశాలు ప్రభావితమైనట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని