Vice President Election: ముగిసిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌‌.. పోలైన ఓట్లు ఎన్నంటే!

ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. పార్లమెంట్‌ భవనంలో ఉదయం 10 గంటలకు ఓటింగ్‌ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ పదవికి ఎన్డీయే కూటమి తరఫున...

Published : 06 Aug 2022 18:01 IST

దిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. పార్లమెంట్‌ భవనంలో ఉదయం 10 గంటలకు ఓటింగ్‌ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 725 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92.9 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఆరోగ్య కారణాల వల్ల భాజపా ఎంపీలు సన్నీ దియోల్, సంజయ్ ధోత్రే ఓటు వేయలేదు. లోక్‌సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. కానీ.. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ.. ఇద్దరు ఎంపీలు.. శిశిర్ అధికారి, దిబ్యేందు అధికారి పోలింగ్‌లో పాల్గొన్నారు. మిగతా 34 టీఎంసీ ఎంపీలు ఓట్లు వేయలేదు.

ఈ పదవికి ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ ఆళ్వా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. కాసేపట్లో తుది ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే, ఉభయసభల్లో ఎన్డీయే, దాని మిత్రపక్షాలకు స్పష్టమైన బలమున్నందున అధికారిక కూటమి అభ్యర్థి జగదీప్‌ గెలుపు దాదాపు లాంఛనమే కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని