Economy: వచ్చే ఏడాది 100 ట్రిలియన్‌డాలర్లుదాటనున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ!

వచ్చే ఏడాదిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్‌ డాలర్లు దాటనుందని బ్రిటీష్‌ కన్సల్టెన్సీ సంస్థ సెబ్‌ఆర్‌ వెల్లడించింది. అయితే, అమెరికాను వెనక్కి నెట్టి నంబర్‌ 1 ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న చైనాకు ఆ లక్ష్యం నెరవేరడానికి గతంలో అంచనా వేసిన దానికంటే కాస్త ఎక్కువ సమయం పడుతుందని

Updated : 26 Dec 2021 10:44 IST

లండన్‌: వచ్చే ఏడాదిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా 100 ట్రిలియన్‌ డాలర్లు దాటనుందని బ్రిటిష్‌ కన్సల్టెన్సీ సంస్థ సెబ్‌ఆర్‌ వెల్లడించింది. అయితే, అమెరికాను వెనక్కి నెట్టి నంబర్‌ 1 ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న చైనాకు ఆ లక్ష్యం నెరవేరడానికి గతంలో అంచనా వేసిన దానికంటే కాస్త ఎక్కువ సమయం పడుతుందని పేర్కొంది. చైనా 2028 నాటికి ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని గతేడాది వరల్డ్‌ ఎకనమిక్‌ లీగ్‌ టేబుల్‌ నివేదిక అంచనా వేసింది. అయితే, 2030లోనే అది సాధ్యమవుతుందని సెబ్‌ఆర్‌ తెలిపింది.

భారత్ విషయానికొస్తే.. వచ్చే ఏడాది ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థను, 2023లో బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని తిరిగి పొందగలదని వెల్లడించింది. 2033 నాటికి జర్మనీ.. జపాన్ ఆర్థిక వ్యవస్థను అధిగమిస్తుందని వెల్లడించింది. అలాగే, 2034 నాటికి ఇండోనేషియా తొమ్మిదో స్థానంలో నిలుస్తుందని, 2033నాటికి రష్యా టాప్‌ 10 ఆర్థిక వ్యవస్థలో చోటు సంపాదిస్తుందని అంచనా వేసింది.

"ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణాన్ని ఎలా ఎదుర్కొంటాయనేది ఈ దశాబ్దాపు అతి ముఖ్యమైన సవాల్‌. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం 6.8%కి చేరుకుంది. దీన్ని నియంత్రించకపోతే 2023, 2024లో ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది" అని సెబ్‌ఆర్‌ డిప్యూటీ ఛైర్మన్ డగ్లస్ మెక్‌విలియమ్స్ అన్నారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని