బాక్సులో ఆప్టిప్లెక్స్‌.. బడ్జెట్‌లో ప్రెసిషన్‌

‘లాటిట్యూడ్, ప్రెసిషన్, ఆప్లిప్లెక్స్‌’ పేర్లతో మూడు రకాల సిరీస్‌లను డెల్‌ ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేసింది

Updated : 07 Jan 2021 16:36 IST

‘సెఫ్ ‌షటర్‌’తో ల్యాపీ వెబ్‌ కెమెరాలు

మానిటర్‌ స్టాండ్‌కే అమర్చుకునే పీసీలు

ఇంట్లోనే ఉండి నెట్టింట్లో విహరించాల్సిన స్థితిలో ఉన్నాం. చదువులు, కొలువులు, వ్యాపారాలు.. ఇలా ఏ రంగంలో ఉన్నా ఆన్‌లైన్‌కి అనుసంధానం కావాల్సిన పరిస్థితి. దీంతో ఒడిలో ల్యాపీ, టేబుల్‌పై పీసీ అనివార్యంగా మారాయి. అందుకు తగినట్టుగా ల్యాప్‌టాప్‌ తయారీ కంపెనీలు కొత్త వేరియంట్స్‌తో ముందుకొస్తున్నాయ్‌. డెల్‌ సరికొత్తగా ప్రవేశపెట్టిన ల్యాపీలు, డెస్క్‌టాప్‌లు అదే కోవలోకి వస్తాయి. ‘లాటిట్యూడ్, ప్రెసిషన్, ఆప్లిప్లెక్స్‌’ పేర్లతో మూడు రకాల సిరీస్‌లను డెల్‌ ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేసింది. వాటి విశేషాలేంటో చూద్దాం..


అవసరాలకు తగినట్టుగా.. లాటిట్యూడ్‌ 

14 అంగుళాల తాకే తెరతో తీర్చిదిద్దారు. రిజల్యూషన్‌ 2560X1600 పిక్సల్స్‌. దీంతో ల్యాపీగానూ, ట్యాబ్‌లానూ (టూ-ఇన్‌-వన్‌) దీన్ని వాడుకోవచ్చు. అందుకు తగినట్టుగా కృత్రిమ మేధస్సుతో రూపొందించిన ‘డెల్‌ ఆప్టిమైజర్‌’ సాఫ్ట్‌వేర్‌ని ల్యాపీలో నిక్షిప్తం చేశారు. ఇది ల్యాపీ సామర్థ్యం తగ్గకుండా చూస్తుంది. ‘యాక్టివ్‌ పెన్‌’ సపోర్టుతో స్టైలస్‌తో తాకే తెరపై పని చేసుకోవచ్చు. ఇంటెల్‌ 11వ జనరేషన్‌ ఐ7 ప్రాసెసర్‌ని వాడారు. వీటిల్లోని మరో ప్రత్యేకత ఏంటంటే.. ‘సేఫ్‌ షటర్‌’ టెక్నాలజీ. దీంతో వెబ్‌ కెమెరాని మూసి ఉంచేలా షటర్‌ ఏర్పాటు చేశారు. వెబ్‌కెమెరాని యాక్టివేట్‌ చేసినప్పుడు మాత్రమే అది తెరుచుకుంటుంది. అంటే.. మీరేదైనా వీడియో కాల్‌ మాట్లాడాలి అనుకున్నప్పుడే కెమెరా పని చేస్తుంది అన్నమాట. మిగతా సమయాల్లో షటర్‌ మూసుకుని ఉంటుంది. దీంతో అనధికారికంగా ఎవరూ ల్యాపీ వెబ్‌ కెమెరాని వాడలేరు. ర్యామ్‌ సపోర్టు 32 జీబీ వరకూ ఉంది. ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ సామర్థ్యం 1టీబీ. 

* వీటి అంచనా ధర రూ.1,42,700


కాస్త బడ్జెట్‌లో..  ప్రెసిషన్‌ 3560

ఈ ల్యాపీలో 15.6 అంగుళాల తెర. ఫుల్‌-హెడ్‌డీ రిజల్యూషన్‌. టచ్‌ సపోర్టు కూడా ఉంది. ఇంటెల్‌ కోర్‌ ఐ7-1185 జీ7 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ సపోర్టు 64 జీబీ వరకూ ఉంది. ఇంటర్నల్‌ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ సామర్థ్యం 2 టీబీ. గ్రాఫిక్స్‌ని ప్రాసెస్‌ చేసేందుకు ప్రత్యేకంగా 2 జీబీ ర్యామ్‌ ఉంది. విండోస్‌ 10 ఓఎస్‌తో పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యమూ ఎక్కువే. బరువు 1.5 కేజీలు.

* అంచనా ధర రూ.87,000


బుల్లి బాక్సులోనే ఆప్టిప్లెక్స్‌

ఆధునిక డిజైన్‌తో రూపొందిన డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ అప్టిప్లెక్స్‌. సాధారణంగా మానిటర్‌ పక్కనే కనిపించే సీపీయూలా ఇది ఉండదు. మానిటర్‌ స్టాండ్‌కి అమర్చుకునేలా చిన్న బాక్స్‌లా కనిపిస్తుంది. పై చిత్రంలో మాదిరిగా మానిటర్‌ స్టాండ్‌కి అమార్చుకుని వాడుకోవచ్చు. గత ఏడాది డెల్‌ ప్రవేశపెట్టిన ఆప్టిప్లెక్స్‌ 7070కి అప్‌డేట్‌ వెర్షన్‌గా దీన్ని తీర్చిదిద్దారు. 11వ జనరేషన్‌ ఇంటెల్‌ ఐ5 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ సపోర్టు 64 జీబీ వరకూ ఉంది. ఇంటర్నల్‌ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ సామర్థ్యం 2 టీబీ. డెల్‌ ఆప్టిమైజర్‌ సాఫ్ట్‌వేర్‌ సపోర్టు ఉంది. వివిధ రకాల యూఎస్‌బీ పోర్టులున్నాయి. ప్రత్యేక మానిటర్‌ స్టాండ్‌తో డెల్‌ మానిటర్లకే కాకుండా థర్డ్‌ పార్టీ డిస్‌ప్లేలకూ కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. 

* వీటి అంచనా ధర రూ.55,600 


 

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని