‘లాల్ సింగ్’ కోసం లద్దాఖ్ వెళ్లునున్న చైతూ
అమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించనున్నారు. కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. జూన్‌లో సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్ చేయనున్నారు. దీని కోసం చిత్రబృందం నెలరోజుల ముందుగానే లడఖ్ వెళ్లనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించనున్నారు. కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. జూన్‌లో సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్ జరగనుంది. దీనికోసం చిత్రబృందం నెలరోజుల ముందుగానే లద్దాఖ్ వెళ్లనుంది.
అక్కడే ఓ హోటల్లో చిత్ర బృందం మకాం వేయనుంది. స్థానికంగా ఉండే కొంతమందిని సినిమా కోసం తీసుకోనున్నారట. సినిమా యుద్ధ సన్నివేశాల కోసం హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్’ చిత్ర యాక్షన్ కొరియోగ్రాఫర్ పర్వేజ్ షేక్ పర్యవేక్షణలో చిత్రీకరించనున్నారు. నాగచైతన్య కూడా ఈ షెడ్యూల్లోని కీలక సన్నివేశాల్లో పాల్గొననున్నారని సమాచారం. ‘ఫారెస్ట్ గంప్’లోని బెంజమిన్ బుఫోర్డ్ బ్లూ పాత్రనే ‘లాల్ సింగ్’లో చైతన్య పోషించనున్నారని సమాచారం. చిత్రంలో మోనా సింగ్, సల్మాన్‌ఖాన్, షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
1994 హాలీవుడ్లో విజయవంతమైన ‘ఫారెస్ట్ గంప్’కి ఇది రీమేక్‌గా రూపొందుతోంది. ఆస్కార్ విజేత టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించారు. ‘లాల్ సింగ్ చద్దా’ 2019 అక్టోబర్ 31న చంఢీగఢ్‌లో ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ 2020 మార్చిలో నిలిపివేశారు. తొలుత ఈ సినిమాని గతేడాది క్రిస్మస్కి విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత పలు కారణాల వల్ల ఆలస్యం అయింది. దీంతో 2021 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసేందుకు చిత్రబృందం నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్‌లో సెట్లోకి
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.