ETV win:ఎక్కువమంది వీక్షించిన తెలుగు సిరీస్‌ ‘#90’s’

మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలను కళ్లకు కట్టినట్టు చూపించి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది ‘#90’s’-ఏ మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌’. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సిరీస్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Updated : 03 Feb 2024 10:07 IST

మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలను కళ్లకు కట్టినట్టు చూపించి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది ‘#90’s’-ఏ మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌’. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సిరీస్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను నవీన్‌ మేడారం, రాజశేఖర్‌ మేడారం నిర్మించారు. ఐఎండీబీలో ఇప్పటివరకూ ఎక్కువ మంది వీక్షించిన సిరీస్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఈటీవీ విన్‌ బిజినెస్‌ హెడ్‌ సాయికృష్ణ కొన్ని సిరీస్‌ అందుకున్న విజయాన్ని అభిమానులతో పంచుకుంటూ..‘ఇలాంటి మిడిల్‌క్లాస్‌ జీవితాన్ని మనసుకు హత్తుకొనే విధంగా, మరపురాని అనుభవాన్ని అందించినందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మంచి కంటెంట్‌తో అలరించడానికి ఎదురుచూస్తున్నాము. ఈ విజయం కొనసాగాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు