తల్లి కాబోతున్న అనిత..!

నటి అనిత శుభవార్త చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించారు. పారిశ్రామికవేత్త రోహిత్‌తో ప్రేమలో ఉన్న ఆమె 2013లో ఆయనతో ఏడడుగులు వేశారు. అయితే అనిత తల్లికాబోతుందని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ ఆమె వాటిన్నింటినీ కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె...

Published : 11 Oct 2020 11:36 IST

నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న వీడియో

ముంబయి: నటి అనిత శుభవార్త చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించారు. పారిశ్రామికవేత్త రోహిత్‌తో ప్రేమలో ఉన్న ఆమె 2013లో ఆయనతో ఏడడుగులు వేశారు. అయితే అనిత తల్లికాబోతుందని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ ఆమె వాటిన్నింటినీ కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఈ శుభవార్తను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

తన భర్త రోహిత్‌తో కలిసి ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. రోహిత్‌-అనిత పరిచయం.. ప్రపోజ్‌ చేసుకోవడం.. పెళ్లి.. ఇలా ప్రతి విషయాన్ని ఈ వీడియోలో ఆకట్టుకునే విధంగా చూపించారు. సదరు వీడియో చూసిన నెటిజన్లు.. అనిత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఐశ్వర్యరాయ్‌, అనిల్‌‌ కపూర్‌, అక్షయ్‌ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘తాళ్‌’ చిత్రంతో అనిత వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం ఆమె తెలుగులో తెరకెక్కిన ‘నువ్వు- నేను’ సినిమాలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆమె పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. వెండితెరపైనే కాకుండా ధారావాహికలతో బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆమె అలరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని