యాపిల్‌ సేవలపై నాగ్‌ ఆగ్రహం..!

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ యాపిల్‌ సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాపిల్‌ సేవలు.. కేవలం ఆ సంస్థకు మాత్రమే సానుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ట్విటర్‌ వేదికగా నాగ్‌..

Updated : 09 Dec 2020 15:56 IST

ట్వీట్‌ చేసిన అగ్రకథానాయకుడు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ యాపిల్‌ సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాపిల్‌ సేవలు.. ఏక పక్షంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ట్విటర్‌ వేదికగా నాగ్‌.. తన కోపాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా యాపిల్‌ సేవల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘భారత్‌లోని యాపిల్‌ స్టోర్‌ నుంచి యాపిల్‌ ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేసేటప్పుడు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. వాళ్ల సేవలు, పాలసీలు ఏక పక్షంగా ఉన్నాయి. ఇది మరీ ఘోరమైన చర్య.’ అని నాగ్‌ పేర్కొన్నారు. అయితే, తన ఆగ్రహానికి గల కారణాన్ని మాత్రం నాగ్‌ బయటపెట్టలేదు.

అహిసోర్‌ సోల్మన్‌ దర్మకత్వంలో తెరకెక్కుతున్న ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రంలో ప్రస్తుతం నాగ్‌ నటిస్తున్నారు. ఇందులో ఆయన విజయ్‌వర్మ అనే ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. దీనితోపాటు బాలీవుడ్‌లో రానున్న ‘బ్రహ్మాస్త్ర’లోనూ ఆయన నటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని