బధిరుడిగా నాగశౌర్య?

కెరీర్‌ ఆరంభం నుంచి వైవిధ్యభరితమైన కథలతోనే మెప్పిస్తూ వస్తున్నారు హీరో నాగశౌర్య. ఇప్పుడాయన చేతిలో దాదాపు అరడజను వరకు చిత్రాలున్నాయి. వాటిలో అగ్ర హీరో బాలకృష్ణతో చేయనున్న ఓ క్రేజీ చిత్రమూ ఉంది. దీన్ని కొత్త దర్శకుడు...

Updated : 17 Dec 2020 23:02 IST

హైదరాబాద్‌: కెరీర్‌ ఆరంభం నుంచి వైవిధ్యభరితమైన కథలతోనే మెప్పిస్తూ వస్తున్నారు హీరో నాగశౌర్య. ఇప్పుడాయన చేతిలో దాదాపు అరడజను వరకు చిత్రాలున్నాయి. వాటిలో అగ్రహీరో బాలకృష్ణతో చేయనున్న ఓ సినిమా కూడా ఉంది. దీన్ని కొత్త దర్శకుడు శ్రీమన్‌ వేముల తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య ఓ బధిరుడిగా కనిపించనున్నారని  సమాచారం. అంటే మూగ, చెవిటి లక్షణాలున్న పాత్రలో దర్శనమివ్వబోతున్నారన్న మాట. అలాగని ఆయన పాత్రేమీ ఎమోషనల్‌గా ఉండదని, ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది. దీంట్లో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యముంటుందని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాదే సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. ప్రస్తుతం నాగశౌర్య ‘లక్ష్య’, ‘వరుడుకావాలి’ చిత్రాలు చేస్తున్నారు.

ఇవీ చదవండి

రెమ్యూనరేషన్‌ వద్దన్న ఎన్టీఆర్‌..!

2020ని ఊపేసిన సిధ్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని