ఆ ఈవెంట్‌ చేయనందుకు సంతోషిస్తున్నా: రోజా

గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘జబర్దస్త్‌’. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. రోజా, మనో, అనసూయల...........

Updated : 27 Nov 2020 21:57 IST

హైదరాబాద్‌: గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘జబర్దస్త్‌’. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. రోజా, మనో, అనసూయల కామెడీ టైమింగ్‌తో పాటు కమెడియన్లు వేసే ఆటో పంచులతో ఈ షో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో ప్రేక్షకులను మెప్పిస్తోంది. 

షోలో భాగంగా హైపర్‌ ఆది టీమ్‌ ‘అక్కా ఎవరే అతగాడు’ స్పూఫ్‌తో, నాన్‌ స్టాప్‌ పంచులతో సందడి చేయనున్నారు. ఈ స్కిట్‌లో భాగంగా ప్రతి ఒక్కరు సెలబ్రిటీ గెటప్‌ ఫొటోలతో వచ్చి.. ‘నా పేరు వర్షిణి, నా పేరు రష్మి అనగా.. ఇంతలో రోజా అందుకొని నా పేరు రోజా.. ఈ ఈవెంట్‌ చేయనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. లేదంటే ఎవరు ఏ బోర్డు వేసుకొని వస్తారో అర్థం కావట్లేదు..’ అంటూ సరదాగా పంచులతో నవ్వులు పూయించనున్నారు. వెంకీ మంకీస్‌, చలాకీ చంటి,  తాగుబోతు రమేష్‌ స్కిట్లు సైతం ఆకట్టుకోనున్నాయి. అంతేకాకుండా రాకెట్ రాఘవ-రోజా మధ్య జరిగే వరుస పంచులతో ఆకట్టుకోనుంది. ఆద్యంతం పంచులతో నవ్వులు పూయించే ఈ కామెడీ ప్రపంచంలోకి వెళ్లాలంటే వచ్చే గురువారం (డిసెంబర్‌ 3)న ప్రసారం కానున్న ‘జబర్దస్త్‌’ చూడాల్సిందే..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని