My Name Is Shruthi: శ్రుతి పోరాటం

‘చర్మం ఒలిచి బిజినెస్‌ చేస్తామంటున్నారు. ఏం చేయాలి వాళ్లని?’ అంటూ ఆవేదనగా ప్రశ్నిస్తోంది ఓ యువతి. మానవ అవయవాలతో వ్యాపారం చేస్తున్న మాఫియాపై ఆమె ఎలా పోరాటం చేసిందో

Updated : 13 Mar 2022 08:44 IST

ర్మం ఒలిచి బిజినెస్‌ చేస్తామంటున్నారు. ఏం చేయాలి వాళ్లని?’ అంటూ ఆవేదనగా ప్రశ్నిస్తోంది ఓ యువతి. మానవ అవయవాలతో వ్యాపారం చేస్తున్న మాఫియాపై ఆమె ఎలా పోరాటం చేసిందో తెలియాలంటే ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’ చూడాల్సిందే. హన్సిక ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రమిది. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్‌ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా హిందీ, తమిళ టీజర్లని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ  ‘‘వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే అంశాలు ఉంటాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. మురళీశర్మ, జేపీ, ఆడుకలం నారాయణ్‌, ప్రవీణ్‌, సీవీఎల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ రాబిన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని