ఖాజీపల్లి అటవీ అభివృద్ధికి ప్రభాస్‌ భారీ విరాళం

అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ ఖాజిపల్లి అర్బన్‌ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉన్న 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న

Updated : 07 Sep 2020 18:37 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ ఖాజీపల్లి అర్బన్‌ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉన్న 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న ఆయన ఆ ప్రాంత అభివృద్ధి కోసం రూ.2కోట్లు అందించారు. సోమవారం ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్‌కు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌లతో పాటు ప్రభాస్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎంపీ సంతోష్‌కుమార్‌ చొరవతో ప్రభాస్‌ ఈ అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. తన తండ్రి దివంగత యూవీఎస్‌ రాజు పేరు మీద ఈ అర్బన్ పార్కు, అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్లు పార్కు శంఖుస్థాపన సందర్భంగా ప్రభాస్‌ అన్నారు. అనంతరం ఎంపీ సంతోష్‌ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ.. త్వరలోనే మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లను దత్తతకు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని