అమెరికా ఎన్నికలపై ప్రియాంక చోప్రా కామెంట్‌

ఉత్కంఠ రేపుతున్న అమెరికా ఎన్నికలపై ప్రముఖ సినీనటి ప్రియాంక చోప్రా స్పందించారు. తన భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి లాంస్‌ ఎంజెల్స్‌లో ఉంటోన్న ఆమె.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సరళిని దగ్గరగా పరిశీలిస్తున్నారు. శ్వేతసౌధంలో పాగా వేసేందుకు జో ...........

Updated : 04 Nov 2020 20:00 IST

లాస్‌ఏంజెల్స్‌: ఉత్కంఠ రేపుతున్న అమెరికా ఎన్నికలపై ప్రముఖ సినీనటి ప్రియాంక చోప్రా స్పందించారు. తన భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి లాస్‌ ఎంజెల్స్‌లో ఉంటోన్న ఆమె.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సరళిని దగ్గరగా పరిశీలిస్తున్నారు.  జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ హోరాహోరీగా తలపడుతున్న ఈ ఎన్నికలపై ఇన్‌స్టా వేదికగా ప్రియాంక తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నారు.  అమెరికా ఎన్నికల్లో అనిశ్చితి కొనసాగుతోందని పేర్కొన్నారు. లాస్‌ ఏంజెల్స్‌లో తన కుటుంబంతో కలిసి ఎన్నికలను గమనిస్తున్నట్టు చెప్పారు. ఇంకా చాలా ఓట్లు లెక్కించాల్సి ఉందని, రాత్రంతా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం కనబడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా షూటింగ్‌ కోసం బెర్లిన్‌ వెళ్లిన ప్రియాంక ఇటీవలే లాస్‌ఏంజెల్స్‌కు చేరుకున్నారు. 

మరోవైపు, ట్రంప్‌, జో బైడెన్‌ మధ్య పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు బైడెన్‌కు 238, ట్రంప్‌నకు 213 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జార్జియాలో కౌంటింగ్‌ను నిలిపివేశారు. మరో 4గంటల తర్వాత లెక్కింపు ప్రారంభం కానుంది. ఇప్పటికే జార్జియాలో 92శాతం లెక్కింపు పూర్తయింది. అలాగే, ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాకుండానే తాను గెలిచినట్టు ప్రకటించుకున్న ట్రంప్‌.. పోస్టల్‌ బ్యాలెట్లను ఆపేయాలని, లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరిస్తున్నారు. అయితే, ఓట్ల లెక్కింపును నిలిపివేయించేందుకు ట్రంప్‌ సుప్రీంకు వెళ్తే ఆ ప్రయత్నాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనని బైడెన్‌ శిబిరం స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని