రాజ్‌కుమార్‌ రావ్‌ ‘ఛాలంగ్‌’ ట్రైలర్‌ చూశారా?

విభిన్న చిత్రాల దర్శకుడు హన్సల్‌ మోహతా దర్శకత్వం వహించిన సినిమా ‘ఛాలంగ్‌’. స్పోర్ట్స్‌ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌రావ్‌, నుస్రత్ బరుచా కీలక

Published : 18 Oct 2020 03:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న చిత్రాల దర్శకుడు హన్సల్‌ మోహతా దర్శకత్వం వహించిన సినిమా ‘ఛాలంగ్‌’. స్పోర్ట్స్‌ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌రావ్‌, నుస్రత్ బరుచా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. హరియాణాలోని ఒక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడి నేపథ్యంగా కథ సాగుతుంది. రాజ్‌కుమార్‌రావ్‌ వ్యాయామ ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు. బద్ధకస్తుడైన వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లలకు ఆసక్తికరంగా ఏయే విషయాలు నేర్పించాడన్నది ట్రైలర్‌లో చూపించారు.

ఈ చిత్ర దర్శకుడైన హన్సల్‌ మోహతా మాట్లాడుతూ..‘‘మేం కామెడీతో పాటు ఒక చిన్న సందేశం ఇవ్వాలని ఈ చిత్రాన్ని  నిర్మించాం. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల జీవితాలకు ఈ చిత్రం దగ్గరగా ఉంటుంది. ఈ దీపావళికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీనిని తీసుకురాబోతున్నాం. కామెడీ, ఫ్రెండ్‌షిప్‌, యుద్ధం, లవ్‌తో పాటు అనేక ఎమోషన్స్‌ ఈ చిత్రంలో ఉంటాయి ’’అని అన్నారు.  రాజ్‌కుమార్‌ రావ్‌ మాట్లాడుతూ...‘నా పాఠశాల రోజులను హరియాణాలోనే గడిపాను. అందువల్ల ఇందులోని పాత్ర నాకు దగ్గరగా ఉంది. పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొదించడానికి స్పోర్ట్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. నన్ను ఛాలంగ్‌ చిత్రం నా పాఠశాల రోజులకు తీసుకువెళ్లింది’’ అని అన్నారు. నవంబరు 13న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని